- బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా..
-
సభ్యుడిగా చేరినట్లు ఫోటోని పోస్ట్ చేసిన భార్య రివాబా..

Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా భారతీయ జనతా పార్టీ(బీజేపీలో) చేరారు. సెప్టెంబర్ 02న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని రవీంద్ర జడేజా భార్య, బీజేపీ ఎమ్మెల్యే రివాబా జడేజీ పంచుకున్నారు. రవీంద్ర జడేజా బీజేపీలో చేరినట్లు ఆమె ఫోటోని పోస్ట్ చేశారు. మెంబర్‌షిప్ డ్రైవ్‌ను ఇటీవలే బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారు, ఆయన సెప్టెంబర్ 2 న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని సభ్యునిగా చేర్చుకున్నారు.
రివాబా 2019లో బీజేపీలో చేరారు. ఆమె 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆమె ఆప్ అభ్యర్థి కర్షన్ భాయ్ కర్మూర్‌ని ఓడించారు.
🪷 #SadasyataAbhiyaan2024 pic.twitter.com/he0QhsimNK
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 2, 2024