- పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకధారులుగా ఇద్దరు అథ్లెట్లు
-
పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ స్ప్రింటర్ ప్రీతి పాల్ -
స్వర్ణ పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్.

పారాలింపిక్ ముగింపు కార్యక్రమంలో భారతదేశ పతాకధారులుగా ఇద్దరు అథ్లెట్లు పాల్గొననున్నారు. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ స్ప్రింటర్ ప్రీతి పాల్, స్వర్ణ పతక విజేత ఆర్చర్ హర్విందర్ సింగ్ పారిస్ క్రీడల ముగింపు వేడుకలో పాల్గొననున్నారు. ముప్పై మూడేళ్ల హర్విందర్.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ ఆర్చర్. అతను 2021లో టోక్యోలో కాంస్య పతకాన్ని సాధించాడు.
ఈ సందర్భంగా ఆర్చర్ హర్విందర్ సింగ్ మాట్లాడుతూ.. భారత్‌కు స్వర్ణ పతకం సాధించడం ఒక కల.. ఆ కల నిజమైందని అన్నారు. ఇప్పుడు ముగింపు వేడుకలో భారతదేశ పతాకధారిగా నిలవడం అతి పెద్ద గౌరవం అని చెప్పారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిదీ ఈ విజయం అని అన్నారు. వారి కలలను నెరవేర్చుకోవడానికి తాను చాలా మందికి స్ఫూర్తినివ్వగలనని ఆశిస్తున్నట్లు హర్విందర్ సింగ్ పేర్కొన్నారు.
మహిళల T35 ఈవెంట్ లలో కాంస్య పతకాలు సాధించిన 23 ఏళ్ల ప్రీతి మాట్లాడుతూ.. ‘భారత్ పతాకధారిగా నిలవడం గర్వకారణం. ఇది నాకోసమే కాదు ప్రతి ఒక్క పారా అథ్లెట్‌కు అవాంతరాలను అధిగమించి దేశం గర్వించేలా చేశారు.’ అని చెప్పింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల ప్రదర్శన భావి తరానికి స్ఫూర్తినిస్తుందని భారత జట్టు ప్రచార హెడ్ సత్య ప్రకాశ్ సంగ్వాన్ అన్నారు. భారత్ ఇప్పటివరకు ఆరు స్వర్ణాలు, తొమ్మిది రజతాలతో సహా 26 పతకాలు సాధించింది, ఇది పారాలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన పేర్కొన్నారు.