Leading News Portal in Telugu

IND vs BAN: భారత్-బంగ్లా మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. వేదికను మార్చే ప్రసక్తే లేదు: బీసీసీఐ


  • సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్
  • సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్
  • నిరసనలు తెలిపేందుకు హిందూ మహాసభ సిద్ధం
IND vs BAN: భారత్-బంగ్లా మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. వేదికను మార్చే ప్రసక్తే లేదు: బీసీసీఐ

BCCI Not Shift Kanpur Test Between IND vs BAN: సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. కాన్పూర్‌ వేదికగా సెప్టెంబర్ 27 నుంచి రెండో టెస్ట్ మొదలుకానుంది. అయితే మ్యాచ్‌ జరగకుండా నిరసనలు తెలిపేందుకు హిందూ మహాసభ సిద్ధమైందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. భారత్-బంగ్లా రెండో టెస్ట్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైందని, వేదికను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే కారణంతో బంగ్లా క్రికెట్‌ జట్టు పర్యటనను అడ్డుకోవాలని హిందూ మహాసభ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ వార్తలపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ‘నిరసనలు, బెదిరింపులకు సంబంధించి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నాం. క్రికెటర్లకు మేం ఘన స్వాగతం పలుకుతాం. కాన్పూర్‌లోనే కాదు.. ఇలాంటి పరిస్థితులు ఏ స్టేడియంల వద్ద ఉన్నా చర్యలు తీసుకుంటాం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.