Leading News Portal in Telugu

kohli Gambhir: ఇది నిజమేనా.. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి..


  • సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్.
  • బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల.
  • సోషల్ మీడియాలో వైరల్.
kohli Gambhir: ఇది నిజమేనా.. విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ కలిసి..

Virat kohli and Gautam Gambhir Chitchat: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సందర్భంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న కోహ్లీ., ఎల్‌ఎస్‌జి టీంకి మెంటార్‌గా ఉన్న గంభీర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా రచ్చ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, గంభీర్ గతంలో కూడా ఈ విషయాలను పుకార్లుగా పేర్కొన్నాడు. అవేమి కాదంటూ.. కోహ్లీతో తనకి మంచి సంబంధాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు బీసీసీఐ విడుదల చేసిన ఇంటర్వ్యూలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య మంచి సమన్వయం కనిపించింది.

Hyderabad : జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో భారత క్రికెట్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్‌ ల టెస్ట్ సిరీస్‌కు ముందు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది. దీనిలో ప్రముఖ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, జట్టు కోచ్ గౌతం గంభీర్ ఒక ఇంటర్వ్యూలో కలిసి ఉన్నారు. గంభీర్, కోహ్లి కూడా ఒకరితో ఒకరు సరదాగా నవ్వుకుంటూ కనిపించడం ఇందులో చూడవచ్చు. ఈ ఇంటర్వ్యూలో ఇరువురి ప్రత్యేకమైన ప్రదర్శనలకు సంబంధించి కాస్త చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కొద్దీ పాటి సీరియస్, మరింత హాస్యం ఉండడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.