Leading News Portal in Telugu

Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. నేటితో యువీ విధ్వంసానికి 17 ఏళ్లు..


  • 6 బంతుల్లో 6 సిక్సర్లు..
  • నేటితో యువీ విధ్వంసానికి 17 ఏళ్లు..
  • ఇంగ్లాండ్ పై విరుచకపడ్డ యువి.
Yuvraj Singh: 6 బంతుల్లో 6 సిక్సర్లు.. నేటితో యువీ విధ్వంసానికి 17 ఏళ్లు..

Yuvraj Singh 6 balls 6 Sixers: భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజును ఏ అభిమానులూ మర్చిపోరు. ఈ రోజున 17 సంవత్సరాల క్రితం, మొదటిసారి జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఈ రోజు గ్రూప్ మ్యాచ్‌లో ఇండియా ఇంగ్లాండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ తుఫాను బ్యాటింగ్ చేసి అందరినీ ఉర్రూతలూగించాడు. డర్బన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన యువీ ఇంగ్లండ్‌ను మ్యాచ్, టోర్నమెంట్ రెండింటి నుండి దూరం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను అంతర్జాతీయ టీ20లో అప్పటివరకు ఫాస్టెస్ట్ ఫిఫ్టీని కూడా సాధించాడు. గతేడాది వరకు ఈ రికార్డు అతని పేరు మీదనే ఉండేది.

Train Incident: ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా..? ఫోన్‌లో మాట్లాడుతూ రైలును ఢీకొన్న తల్లి, బిడ్డ..

ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 17వ ఓవర్లో యువరాజ్ స్ట్రైక్‌కి దిగిన సమయంలో భారత్ స్కోరు 3 వికెట్లకు 155 పరుగులు. భారత ఇన్నింగ్స్‌లో మరో 20 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. యువరాజ్ ఇక్కడ కొన్ని బంతులు మాత్రమే ఆడాడు. యువీ తన మొదటి 6 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 14 పరుగులు చేశాడు. అందులో అతను ఫ్లింటాఫ్‌ బౌలింగ్ లో రెండు ఫోర్లు కొట్టాడు. అయితే ఓవర్ ముగిసాక ఫ్లింటాఫ్ యువరాజ్‌తో ఏదో చెప్పాడు. దాని కారణంగా యువీ కోపం తెచ్చుకున్నాడు. అంపైర్ అతడికి కోపం రాకుండా ఆపేందుకు ప్రయత్నించగా, యువీ కూడా అంపైర్‌తో మాట్లాడుతూ ఫ్లింటాఫ్ వాదనకు దిగుతున్నాడని, అతను అతనికి సమాధానం ఇస్తున్నాడని విషయాలను జాగ్రత్తగా చూడమని చెప్పాడు. దీని తర్వాత యువీ స్ట్రైక్‌లోకి వచ్చాడు.

Black Pepper: రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే వీటిని తీసుకోవాల్సిందే..

ఫ్లింటాఫ్ యువీని దృష్టి మరల్చడానికి, అవుట్ చేయడానికి ప్లాన్ చేసి బ్రాడ్ ను బౌలింగ్ చేయించాడు. కానీ., అది ఎదురుదెబ్బ తగిలి స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడు. బ్రాడ్ వేసిన మొత్తం 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన యువీ 36 పరుగులు చేశాడు. దింతో టీమిండియా క్రికెట్ అభిమానుల్లో ఆనందం తార స్థాయికి చేరుకుంది. ఈ విధంగా కేవలం 12 బంతుల్లో యాభై సాధించాడు యువీ. ఇది గతేడాది వరకు T20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగానే ఉంది. అయితే., గతేడాది గ్వాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ అయిరీ మంగోలియాపై 9 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టి యువీ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే నేటికీ యువీ ఈ స్పెషల్ ఇన్నింగ్స్ భారత అభిమానులకు ప్రత్యేకం. ఆ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.