Leading News Portal in Telugu

IND vs BAN: మొదటి రోజు ముగిసిన ఆట.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌


  • బంగ్లాతో తొలి టెస్ట్‌లో భారీ స్కోర్‌ దిశగా భారత్‌
  • ఆరు వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసిన భారత్‌
  • బంగ్లాదేశ్‌పై సెంచరీతో చెలరేగిన అశ్విన్‌
  • 108 బంతుల్లో సెంచరీ చేసిన అశ్విన్‌.
IND vs BAN: మొదటి రోజు ముగిసిన ఆట.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌

చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్‌లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (86*), అశ్విన్ ఉన్నారు. తొలి రోజు ఆటలో ముగ్గురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు బ్యాటర్లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు.

88 పరుగుల వద్ద రోహిత్ శర్మ (6), శుభ్‌మన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత.. రిషబ్ పంత్ (39) పరుగులు చేసి ఔటయ్యాడు. నాలుగో వికెట్‌కు జైస్వాల్‌తో కలిసి పంత్ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం.. యశస్వి జైస్వాల్‌కు మద్దతుగా కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ 95 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 144 పరుగుల స్కోరు వద్ద యశస్వి రూపంలో భారత్‌ ఐదో వికెట్ కోల్పోయింది. యశస్వి 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, అశ్విన్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. ఆ తర్వాత.. అశ్విన్ 108 బంతుల్లో సెంచరీ సాధించాడు. వీరిద్దరి మధ్య 227 బంతుల్లో 195 పరుగుల భాగస్వామ్యం ఉంది. బంగ్లాదేశ్‌ తరఫున హసన్‌ మహమూద్‌ నాలుగు వికెట్లు తీశాడు.