Leading News Portal in Telugu

IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం! పాకిస్తాన్‌లా కాదు


IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్‌ ఘన విజయం! పాకిస్తాన్‌లా కాదు

India won by 280 Runs Against Bangladesh: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన బంగ్లా.. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంకు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో (82) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్‌ 6 వికెట్స్ పడగొట్టగా.. రవీంద్ర జడేజా 3, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్‌ తీశాడు. పాకిస్తాన్‌ను దాని సొంతగడ్డపై ఓడించిన బంగ్లాకు భారత గడ్డపై తలవంచక తప్పలేదు. ఇక సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఆరంభం కానుంది.