- భారత్-పాక్ మధ్య మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
- మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది. పాకిస్తాన్, భారత్ జట్లలో ఒక్కో మార్పుతో బరిలోకి దిగుతుంది. భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడగా.. ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించగా, భారత్ ఓడిపోయింది. తన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ భారత్‌కు చావోరేవో. ఇకనుంచి ప్రతి మ్యాచూ కీలకం కాబట్టి పాకిస్థాన్‌పై నేడు గెలిచి తీరాల్సిందే. లేదంటే టోర్నీ ఆరంభ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇంత ఒత్తిడి మధ్య హర్మన్‌ప్రీత్ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో..? చూడాలి.
S Jaishankar :జార్జ్ సోరోస్ లేదా కిమ్ జోంగ్ ఉన్‌తో డిన్నర్.. జైశంకర్ రిఫ్లై అదుర్స్..
భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, S సజ్నా, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.
పాకిస్తాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునిబా అలీ (వికెట్ కీపర్), గుల్ ఫిరోజా, సిద్రా అమీన్, నిదా దార్, అలియా రియాజ్, ఒమైమా సొహైల్, ఫాతిమా సనా (కెప్టెన్), తుబా హసన్, నష్రా సంధు, సయ్యదా అరుబ్ షా, సాదియా ఇక్బాల్.