Leading News Portal in Telugu

IND vs BAN: భారత్-బంగ్లాదేశ్ తొలి టీ20.. ఇండియా ఫీల్డింగ్


భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు గ్వాలియర్ లో మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అడుగుపెడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి దృష్టి అతని పైనే ఉంది. మయాంక్‌తో పాటు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ బంగ్లాదేశ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు. టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు కొందరే ఉన్నారు. ఈ క్రమంలో.. యంగ్ ప్లేయర్లకు ఇదొక సువర్ణవకాశం.

Read Also: T20 World Cup 2024: భారత్ బోణీ.. పాకిస్తాన్ పై గెలుపు

ఇండియా (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (W), సూర్యకుమార్ యాదవ్ (C), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): లిటన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహీద్ హృదయ్, మహ్ముదుల్లా, జాకర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్, రహ్మద్, రహ్మద్ ఇస్లాం.