Leading News Portal in Telugu

IPL 2025 Auction: భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు చోటు.. ఐపీఎల్ ప్రాంచైజీలకు పెద్ద బొక్క!


  • ఆరుగురు ఆటగాళ్లకు అవకాశం
  • టీమిండియాలోకి ఆరుగురు అరంగేట్రం
  • ప్రాంచైజీలకు పెద్ద బొక్క
IPL 2025 Auction: భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు చోటు.. ఐపీఎల్ ప్రాంచైజీలకు పెద్ద బొక్క!

ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌‌ను ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఆప్షన్ ఉంది. అక్టోబర్ 31వ తేదీ లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వేలం నవంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వేలం సందర్భంగా ప్రాంచైజీలకు పెద్ద బొక్క పడే అవకాశం ఉంది.

ఐపీఎల్ 2024 అనంతరం ఆరుగురు భారత ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది. ఇటీవలి కాలంలో రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్‌‌లు టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. దాంతో వీరికి అన్‌క్యాప్డ్ ప్లేయర్ అనే ట్యాగ్ పోయింది. వీరిని రూ.4 కోట్లతో రిటైన్ చేసుకునే వెసులుబాటు ప్రాంచైజీలకు ఉండదు. ఒకవేళ రిటైన్ చేసుకుంటే.. కనీసం రూ.11 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాంతో ప్రాంచైజీలకు పెద్ద బొక్క పడనుంది. ఈ భారత ఆటగాళ్లను ప్రాంచైజీలు ఇంతకు కొంటాయో చూడాలి.

రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్), తుషార్ దేశ్‌పాండే (చెన్నై సూపర్ కింగ్స్), సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్), అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్), నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్), మయాంక్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో రియాన్, అభిషేక్, నితీశ్, తుషార్ రాణించిన విషయం తెలిసిందే. మయాంక్ గాయపడి నాలుగు మ్యాచ్‌లే ఆడినా.. 7 వికెట్స్ పడగొట్టాడు. దాంతో వీరికి భారీ ధర పలికే అవకాశం ఉంది.