Leading News Portal in Telugu

David Warner Retirement: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటా.. వార్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!


  • డేవిడ్‌ వార్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటా
  • సెలక్షన్‌కు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా
David Warner Retirement: రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటా.. వార్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో సిరీస్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తన అవసరం జట్టుకు ఉందని జట్టు భావిస్తే.. రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా అని వార్నర్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు సరైన ఓపెనర్‌ లేని లోటుని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేవ్ భాయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా కోడ్ స్పోర్ట్స్‌తో డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ… ‘సెలక్షన్‌కు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. ఎప్పుడు నా ఫోన్‌ రింగ్‌ అవుతుందా? అని ఎదురు చూస్తున్నా. ఫిబ్రవరి తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఓకే టెస్టే మ్యాచ్ ఆడారు. వాళ్లు ఎంత సన్నద్ధతతో ఉన్నారో.. నేనూ అంతే ఉన్నాను. భారత్‌తో సిరీస్‌లో నా అవసరం ఉందని టీమ్ భావిస్తే.. ప్రాక్టీస్‌ కోసం షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో బరిలో దిగుతా. నేను కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.

రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటానని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీకి డేవిడ్‌ వార్నర్‌ చెప్పాడట. అయితే నువ్ రిటైర్ అయ్యావు అని వారు సమాధానం ఇచ్చారట. 37 ఏళ్ల వార్నర్‌ 2024 టీ20 ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్‌పై చివరి టెస్టు ఆడాడు. 112 టెస్టులు ఆడిన వార్నర్ 8786 రన్స్ చేశాడు. ఇందులో 26 సెంచరీలు ఉండగా.. కెరీర్‌లో అత్యుత్తమ 335 నాటౌట్. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్‌ నవంబర్‌ 22న ఆరంభం కానుంది.