Leading News Portal in Telugu

India suffered a heavy defeat in the second Test. New Zealand won the series.


  • న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి

  • 245 పరుగులకు ఆలౌట్

  • 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

  • 3 టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ 2 మ్యాచ్లు విజయం

  • సిరీస్ కోల్పోయిన టీమిండియా.
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి.. సిరీస్ పాయే

పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని చవి చూసింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్‌లో న్యూజిలాండ్‌ వరుసగా రెండో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో.. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది.

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో.. భారత్‌ ముందు 359 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు.. మరోసారి నిరాశపరిచారు. యశస్వి జైస్వాల్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. దీంతో.. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 208 పరుగులకు ఆలౌటైంది.

భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (77), రవీంద్ర జడేజా (42) మాత్రమే కివీస్ బౌలర్లకు దీటుగా ఆడారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లీ (17) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయ్యారు. శుభమన్ గిల్ 23, రిషబ్ పంత్ డకౌట్, సర్ఫరాజ్ ఖాన్ 9, వాషింగ్టన్ సుందర్ 21, రవిచంద్రన్ అశ్విన్ 18 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్‌లో మరోసారి సాంథ్నర్ 6 వికెట్లతో చెలరేగాడు. అజాజ్ పటేల్ 2, గ్లేన్ ఫిలిప్స్ ఒక వికెట్ పడగొట్టాడు.