Leading News Portal in Telugu

Rohit Sharma revealed the reasons behind India’s loss of the Test series against New Zealand.


  • భారత గడ్డపై 12 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్

  • భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్‌ జట్టు టెస్టు సిరీస్‌లో విజయం

  • రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి

  • ఓటమికి గల కారణాలను వెల్లడించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

  • ఈ ఓటమి మాకు చాలా నిరాశ కలిగించింది- రోహిత్ శర్మ

  • ఈసారి మేము అనుకున్నట్లు జరగలేదు- రోహిత్ శర్మ.
IND vs NZ: టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్

మరే ఇతర జట్టు చేయలేని అద్భుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసింది. భారత గడ్డపై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుంది. టామ్ లాథమ్ సారథ్యంలోని కివీస్ జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లను గెలిచి 2-0తో టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. భారత గడ్డపై తొలిసారిగా న్యూజిలాండ్‌ జట్టు టెస్టు సిరీస్‌లో విజయాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. ఓటమికి గల కారణాలను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.

పుణె టెస్టు మ్యాచ్‌లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇది తమకు చాలా నిరాశ కలిగించిందని అన్నాడు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని వెల్లడించాడు. ఈ విజయం సాధించిన ఘనత తమకంటే బాగా ఆడిన న్యూజిలాండ్‌కే దక్కుతుందని పేర్కొన్నాడు. కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం.. కివీస్ జట్టు సవాళ్లకు స్పందించడంలో విఫలమై ఓటమి పాలయ్యామని రోహిత్ శర్మ తెలిపాడు.

తాము గెలవడానికి తగినన్ని పరుగులు చేశామని తాను అనుకోను అని రోహిత్ శర్మ అన్నాడు. గెలవాలంటే 20 వికెట్లు తీయాలి.. బ్యాటర్ పరుగులు చేయాలి. కివీస్ జట్టును 250కి పరిమితం చేయడం గొప్ప పునరాగమనం.. కానీ అది తమకు సవాలుగా మారుతుందని తెలుసన్నాడు. ఇదిలా ఉంటే.. పిచ్‌లో ఎలాంటి లోపం లేదని చెప్పుకొచ్చాడు. తాము సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని రోహిత్ శర్మ అన్నాడు. వాంఖడేలో జరిగే మూడో టెస్టులో మంచి ప్రదర్శన చేసి ఆ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామని చెప్పాడు. ఈ ఓటమి తమ సమిష్టి వైఫల్యం అని అన్నాడు.

తాను బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లను మాత్రమే తప్పుపట్టే వ్యక్తిని కాదు అని రోహిత్ అన్నాడు. మెరుగైన ఆలోచనలు, మెరుగైన పద్ధతులతో వాంఖడే మైదానంలో దిగుతామన్నాడు. తాను దేనిపైనా ఎక్కువ పోస్ట్‌మార్టం చేయాలనుకోనని చెప్పాడు.. తమ ప్లాన్ ప్రకారం పని చేయలేకపోయామన్నాడు. బ్యాట్స్‌మెన్‌లందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.. సరిగ్గా ఆడితే బౌలర్లపై ఒత్తిడి పెంచవచ్చని న్యూజిలాండ్ జట్టు చూపించిందన్నాడు. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ గురించి ఆలోచించడం లేదని చెప్పాడు. తమ ఓటమి యూనిట్ మొత్తం ఓటమి, ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.