Leading News Portal in Telugu

Kane Williamson out from final Test against India


  • భారత్‌తో మూడో టెస్ట్‌
  • న్యూజిలాండ్‌కు భారీ షాక్‌
  • విలియమ్సన్‌ దూరం
IND vs NZ: న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌!

భారత్‌తో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కివీస్ స్టార్‌ బ్యాటర్ కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు సైతం దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గజ్జల్లో గాయం కారణంగానే బెంగళూరు, పూణేలో జరిగిన మొదటి రెండు టెస్టులకు సైతం కేన్ మామ దూరమయిన విషయం తెలిసిందే.

ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కేన్ విలియమ్సన్ గజ్జల్లో గాయం అయింది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కోసం న్యూజిలాండ్‌లో పునరావాసం పొందుతున్నాడు. రిహాబ్‌లో ఉన్న అతడు మూడో టెస్ట్‌ కోసం భారత్‌కు రావడం​ లేదని న్యూజిలాండ్‌ మేనేజ్‌మెంట్‌ నేడు స్పష్టం చేసింది. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌ దృష్ట్యా.. విలియమ్సన్‌ను మూడో టెస్ట్‌కు దూరంగా ఉంచామని తెలిపింది. విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్‌మన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ టీమ్ భారత్‌కు వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కివీస్.. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్‌ ముంబై వేదికగా నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. కేన్ మామ లేకున్నా.. కివీస్ అద్భుత విజయాలు సాధిస్తోంది. చరిత్రను తిరగరాస్తూ.. భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచింది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, టామ్ బండెల్, టామ్ లాతమ్‌లు రాణిస్తున్నారు.