Leading News Portal in Telugu

Mr Cool Dhoni was kept in the Chennai team as an uncapped player and CSK Retentions players are


  • అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా సీఎస్‌కే జట్టుతోనే ధోనీ..
  • చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు
  • జడేజాను రూ.18 కోట్లకు
CSK Retentions: హుకుం.. సీఎస్‌కే జట్టుతోనే ధోనీ.. రిటైన్‌ ఆటగాళ్లు ఎవరంటే

CSK Retentions: ఐపీఎల్ సిరీస్‌ను భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ పండుగగా పరిగణిస్తారు. దాదాపు 2 నెలల పాటు సాగే ఈ సిరీస్ తదుపరి సీజన్ (18వ సీజన్) మార్చి 2025లో జరగనుంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే వేడెక్కాయి. దానికి కారణం త్వరలో ఐపీఎల్ జట్టు మెగా వేలం జరగనుండటమే. ఇటీవల విడుదలైన IPL రిటెన్షన్ నిబంధనలు వేలానికి ముందు ప్రతి జట్టు ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటాయనే అంచనాలను పెంచాయి.

2025 ఐపీఎల్ వేలం కోసం రిటైన్‌ ఆటగాళ్లు నిబంధనల ప్రకారం ఒక జట్టు 6 మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. 6వ ఆటగాడిగా RTM (వేలం సమయంలో) ఉపయోగించవచ్చు. ఈ వేలంలో జట్ల వినియోగ మొత్తం 120 కోట్లకు పెంచబడింది. ప్రతి జట్టుకు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించేందుకు ఈరోజు సాయంత్రం 5 గంటలతో గడువు ముగిసింది.

దీని ప్రకారం, ప్రతి జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించింది. దింతో సీఎస్‌కే కూడా తన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా మిస్టర్ కూల్ ధోనీని 4 కోట్ల రూపాయలకు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై జట్టులో ఉంచారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు, జడేజాను రూ.18 కోట్లకు, మదీషా పతిరానను రూ.13 కోట్లకు, దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. ఈ విషయాన్నీ సీఎస్‌కే యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.