Leading News Portal in Telugu

IPL Retention 2025: Mumbai Indians Retained Rohit Sharma and Tilak Varma


  • ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్
  • అత్యధిక ధర బుమ్రాకే
  • తిలక్ వర్మకు రూ.8 కోట్లు
IPL Retention 2025: అత్యధిక ధర బుమ్రాకే.. ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్ ఇదే!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ జాబితా ప్రకటనకు బీసీసీఐ ఇచ్చిన గడువు నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తన రిటైన్ జాబితాను ప్రకటించింది. ముంబై ఓనర్ ఆకాష్ అంబానీ జట్టును సోషల్ మీడియాలో ప్రకటించారు.

జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రాకు అత్యధిక ధర (రూ.18 కోట్లు) చెల్లించింది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ.16.35 కోట్లు ఇవ్వనుంది. ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రూ.16.30 కోట్లకు రిటైన్ చేసుకుంది. దాంతో ఇన్నిరోజులు వచ్చిన రూమర్లకు చెక్ పడింది. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మను ముంబై అట్టిపెట్టుకుంది.

ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్ట్:
జస్ప్రీత్ బుమ్రా (రూ.18 కోట్లు)
సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
హార్దిక్ పాండ్యా (రూ.16.35 కోట్లు)
రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
తిలక్ వర్మ (రూ.8 కోట్లు)