Leading News Portal in Telugu

Telugu Titans win over Bengaluru Bulls..


  • ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్

  • ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం

  • ఈ మ్యాచ్‌లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపు.
PKL 11: బెంగళూరు బుల్స్ పై తెలుగు టైటాన్స్ విజయం..

ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్- బెంగళూరు బుల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 38-35 పాయింట్ల తేడాతో టైటాన్స్ గెలుపొందింది.

ఫస్టాఫ్‌లో భారీ ఆధిక్యంలో ఉన్న తెలుగు టైటాన్స్.. అనూహ్యంగా సెకండాఫ్‌లో బెంగళూరు బుల్స్ రాణించారు. ఒకానొక దశలో బుల్స్ గెలుస్తుందని అనిపించింది. చివరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు తెలుగు టైటాన్స్ జట్టు విక్టరీ సాధించింది. తెలుగు టైటాన్స్ జట్టులో రైడర్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 14 పాయింట్లతో రాణించాడు. ఆ తర్వాత.. ఆశిష్ నర్వాల్ 6, విజయ్ మాలిక్ 5, అజిత్ పవార్ 5 పాయింట్లతో సపోర్ట్ చేశారు. బెంగళూరు జట్టులో అజింక్యా పవార్ 9, పంకజ్ 9, నితిన్ రావల్ 7 పాయింట్లతో రాణించారు. తెలుగు టైటాన్స్ జట్టులో అత్యధికంగా రైడ్ పాయింట్లు ఉండటంతో విజయం సాధించింది.