Leading News Portal in Telugu

“He should be sold for ₹50 crore” – Basit Ali on Rishabh Pant ahead of IPL 2025 auction


  • ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోట్లు కొల్లగొట్టనున్న రిషబ్ పంత్..!

  • రిషబ్ పంత్ పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసలు

  • కివీస్ బౌలింగ్ దాడిని ధీటుగా ఎదుర్కొని జట్టుకు ముందు నుంచి పోరాడాడు

  • పంత్ కు అత్యంత ప్రతిభ.. నైపుణ్యం ఉంది- బాసిత్ అలీ

  • ఐపీఎల్ 2025 వేలంలో రూ. 50 కోట్లు పొందగలడు- బాసిత్ అలీ.
IPL 2025: ఈ ఆటగాడికి మెగా వేలంలో రూ. 50 కోట్లు వస్తాయి..!

ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కోట్లను కొల్లగొట్టనున్నాడు. ఐపీఎల్ 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో రిషబ్ పంత్ లేడు. డబ్బుల విషయంలో ఢిల్లీ ఫ్రాంచైజీ యజమాని, పంత్ మధ్య ఎటువంటి ఒప్పందం జరగలేదని.. ఈ క్రమంలోనే పంత్‌ను ఢిల్లీ విడుదల చేసిందని చెబుతున్నారు. దీంతో.. వచ్చే సీజన్‌లో పంత్ కొత్త జట్టుకు ఆడబోతున్నాడు.. అతను ఏ జట్టుకు ఆడుతాడన్నది మెగా వేలంలో డిసైడ్ కానుంది.

వేలంలో పంత్‌కు రూ.50 కోట్లు లభించవచ్చు:
న్యూజిలాండ్‌తో జరిగిన ముంబై టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కష్టతరమైన పిచ్‌పై రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసిన తీరుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసలు కురిపించాడు. ‘క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా పరుగులు చేయడం అంత సులభం కాదు. కివీస్ బౌలింగ్ దాడిని ధీటుగా ఎదుర్కొని జట్టుకు ముందు నుంచి పోరాడాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు అత్యంత ప్రతిభ, నైపుణ్యం ఉంది. అతను ఐపీఎల్ 2025 వేలంలో రూ. 50 కోట్లు పొందగలడని బాసిత్ అలీ అభిప్రాయపడ్డాడు.

రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేశాడు. పంత్ రూ. 25 కోట్లు పలుకుతాడని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది.. కానీ రూ. 50 కోట్లకు కొనాలి అని తన అభిప్రాయం అని చెప్పాడు. ‘రిషబ్ పంత్ షాట్ ఎంపికలో చాలా తెలివైనవాడు.. అతను బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో షాట్లు ఆడకూడదని అతనికి తెలుసు. న్యూజిలాండ్‌తో సిరిస్‌లో పంత్ లాగా మరే ఇండియా బ్యాట్స్‌మెన్ ఆడలేకపోయారు.’అని బాసిత్ అలీ తెలిపాడు.