- శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..?
- ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా..?
-
ఓ కొత్త అమ్మాయితో కనిపించిన శిఖర్ ధావన్ - ఆమెతో విమానాశ్రయంలో దర్శనమిచ్చిన గబ్బర్.

శిఖర్ ధావన్ మళ్లీ ఎవరితోనైనా ప్రేమలో పడ్డాడా..? ధావన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే.. వైరల్ అవుతున్న వీడియో చూస్తే అదే సందేహం కలుగుతుంది. శిఖర్ ధావన్ ఓ కొత్త అమ్మాయితో కనిపించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలియనప్పటికీ.. తనతో పాటు ఆమె విమానాశ్రయంలో దర్శనమిచ్చాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు.. ధావన్‌తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ఇంకా క్లారిటీ లేదు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ జీవితంలో కొత్తదనం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.
కొత్త అమ్మాయితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ధావన్ బ్లూ టీ-షర్టు, నలుపు కార్గో ధరించి కనిపించాడు. ఈ వీడియోలో ధావన్ తో ఆ అమ్మాయి కూడా కనిపిస్తుంది. ఆ అమ్మాయి కెమెరా కంట పడకుండా ఉండేందుకు తనను తాను సిగ్గుపడటం కనిపిస్తుంది. ధావన్‌తో తన ఫోటోను ఒకే ఫ్రేమ్‌లో తీయకూడదని ఆమె తన వంతు ప్రయత్నం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో శిఖర్ ధావన్ తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల తర్వాత ధావన్ కొత్త అమ్మాయితో కనిపించడంపై… రానున్న రోజుల్లో శిఖర్ ధావన్‌తో ఈ కొత్త సంబంధం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.