Leading News Portal in Telugu

England tour of West Indies West Indies vs England 3rd ODI at Bridgetown West Indies won by 8 wickets with 42 balls remaining


  • సెంచరీలతో చెలరేగిన బ్రాండన్ కింగ్ & కార్టి..
  • 2-1తో సిరీస్ ను కైవసం చేసుకున్న వెస్టిండీస్.
WI vs England: సెంచరీలతో చెలరేగిన బ్రాండన్ కింగ్, కార్టి.. సిరీస్‭ను కైవసం చేసుకున్న వెస్టిండీస్

WI vs England: కేసీ కార్టి, బ్రెండన్ కింగ్ ల సెంచరీల దెబ్బకు వెస్టిండీస్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో భారీ విజయంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కేసీ కార్టి తన కెరీర్‌లో మొదటి సెంచరీని సాధించాడు. దింతో వెస్టిండీస్ జట్టు విజయాన్ని నమోదు చేయడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. కార్టి కేవలం 114 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 128 పరుగులు చేశాడు. కార్టి 97 బంతుల్లో తన తొలి సెంచరీని సాధించాడు. వెస్టిండీస్ తరఫున ఈ ఘనత సాధించిన మొదటి సెయింట్ మార్టెన్ క్రికెటర్‌గా నిలిచాడు. అతని తర్వాత, కింగ్ తన సెంచరీని పూర్తి చేశాడు. రెండుసార్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, సరైన సమయంలో సెంచరీ చేశాడు. జూలై 2023లో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫైయర్ తర్వాత వన్డేల్లో అతని ఈ ఇన్నింగ్స్ అతని మొదటి యాభై ప్లస్ స్కోరు.

ఆంటిగ్వాలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించిన తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో మూడో మ్యాచ్‌లోకి ప్రవేశించింది. అయితే ఇక్కడ బౌలర్లు రాణించలేకపోయారు. ఇంగ్లండ్ కెప్టెన్ లివింగ్‌స్టోన్ తన తొమ్మిది మంది బౌలర్లలో ఏడుగురిని కార్టి, కింగ్‌లను వికెట్ తీయడానికి ఉపయోగించాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. కార్టి-కింగ్ జోడీ మూడో వికెట్‌కు 209 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అంతకుముందు, ఇంగ్లండ్ పవర్‌ప్లే ముగిసే సమయానికి 24/4 పేలవమైన స్కోరు నుండి కోలుకుంది. చివరకు ఛేజింగ్ కు అవసరమైన 263 పరుగులు చేసింది. జట్టు తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్, డాన్ మౌస్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ కాకుండా శామ్ కుర్రాన్ 40 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 38 పరుగులు చేయగా, జామీ ఓవర్టన్ 32 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరఫున మాథ్యూ ఫోర్డ్ 35 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా.. అతడితో పాటు అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ చెరో రెండు వికెట్లు తీశారు.