Leading News Portal in Telugu

In Ranji Trophy Meghalaya vs JK Match 10 wickets are fall down span of 20 runs details are


  • భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ కొనసాగుతోంది.
  • ఎలైట్ గ్రూప్-ఎలో జరిగిన మేఘాలయ – జమ్మూ కాశ్మీర్ మ్యాచ్‌లో.
  • 20 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్‌మెన్స్ ఔట్.
Ranji Trophy: 20 పరుగుల వ్యవధిలో 10 మంది బ్యాట్స్‌మెన్స్ ఔట్..

Ranji Trophy Meghalaya vs JK: భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ కొనసాగుతోంది. ఎలైట్ గ్రూప్-ఎలో జరిగిన మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ మ్యాచ్‌లో 10 మంది బ్యాట్స్‌మెన్స్ 20 పరుగుల వ్యవధిలో ఔట్ అయ్యి పెవిలియన్‌కు చేరుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా కూడా తెరవలేదు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 9 మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. దింతో మేఘాలయ మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో, మేఘాలయ జట్టు మొదట బ్యాటింగ్‌కు చేపట్టింది. ఓపెనర్లు బమన్‌భా షాంగ్‌ప్లియాంగ్, అర్పిత్ భతేవారా జట్టుకు శుభారంభం అందించి తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ఈ స్కోరుపై బమన్‌భ (21) రూపంలో జట్టుకు తొలి వికెట్ కోల్పోయింది. అతని తర్వాత అర్పిత్ (24) కూడా పెవిలియన్ చేరాడు. ఇక్కడి నుంచి మేఘాలయ ఇన్నింగ్స్ తడబడడంతో జట్టు మొత్తం 73 పరుగులకే కుప్పకూలింది. దింతో మేఘాలయకు మొదటి వికెట్ కోల్పోయినప్పుడు స్కోరు 53 పరుగులు. ఆ తర్వాత 20 పరుగులు చేసేసరికి జట్టులోని 10 మంది బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. మేఘాలయకు చెందిన 5 మంది బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేదు. ఐకమరోవైపు జమ్ముకశ్మీర్‌కు చెందిన ఔకిబ్ నబీ, అబిద్ ముస్తాక్ చెరో 5 వికెట్లు తీశారు.

మేఘాలయ బ్యాటింగ్ కుప్పకూలిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇన్నింగ్స్ కూడా తడబడినట్లు కనిపించింది. సాహిల్ లోత్రా (16 పరుగులు*), అబిద్ ముస్తాక్ (4 పరుగులు*) నాటౌట్‌గా ఉండగా.. ఓపెనింగ్‌లో శుభమ్ ఖజురియా (19), అహ్మద్ బండే (24) పగులకే ఔటయ్యారు. వివరాల్ శర్మ ఖాతా తెరవలేకపోయాడు. కాగా, అబ్దుల్ సమద్ 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు చేరుకున్నాడు. పరాస్ డోగ్రా 12, శివాంశ్ శర్మ 9 పరుగులు చేశారు. మొత్తానికి మొదటి రోజు ముగిసే సమయానికి జమ్మూ కాశ్మీర్ మొదటి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.