Leading News Portal in Telugu

Samson scores a century. team India scored 202 runs.


  • భారీ స్కోరు చేసిన టీమిండియా
  • 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసిన భారత్
  • సౌతాఫ్రికా టార్గెట్ 203 రన్స్
  • సెంచరీతో రాణించిన సంజూ శాంసన్ (107).
IND vs SA: శాంసన్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?

సౌతాఫ్రికా-భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. దీంతో.. భారత్ భారీ స్కోరు చేయగలిగింది. శాంసన్ ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. 50 బంతుల్లో 107 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. ఒకే మ్యాచ్‌లో 10 సిక్సులు కొట్టి రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు.

Sleep: ఏ వయసు వాళ్లు ఎన్ని గంటలు నిద్రపోవాలి? పూర్తి జాబితా..

భారత్ బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (7) పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (21) పరుగులతో పర్వాలేదనిపించాడు. తిలక్ వర్మ కూడా (33) పరుగులతో రాణించాడు. హార్ధిక్ పాండ్యా (2), రింకూ సింగ్ (11), అక్షర్ పటేల్ (7), అర్ష్‌దీప్ సింగ్ (5) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో చివరి 4 ఓవర్లు బౌలింగ్ చేసి టీమిండియా స్కోరును తగ్గించడంతో పాటు వికెట్లు పడగొట్టారు. దీంతో.. టీమిండియా 202 పరుగులు చేసింది. లేదంటే.. ఇంకా భారీ స్కోరు నమోదయ్యే అవకాశం కనిపించింది. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేశాడు. అతను మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. పాట్రిక్ క్రుగర్, పీటర్, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్ తలో వికెట్ సంపాదించారు. సౌతాఫ్రికా ముందు 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు.

Israel-Gaza: నెతన్యాహు ప్రభుత్వం కీలక నిర్ణయం.. గాజా దారి వదిలిపెట్టిన ఇజ్రాయెల్