Leading News Portal in Telugu

AUS vs IND: Cricket Australia Announce Squad For Border Gavaskar Trophy 2024-25


  • నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
  • జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
  • నాథన్ మెక్‌స్వీనేకు అవకాశం
AUS vs IND: భారత్‌తో తొలి టెస్టు.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా! కెప్టెన్‌కు అవకాశం

భారత్‌తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా తొలి టెస్టు పెర్త్‌ వేదికగా నవంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఐదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును శనివారం వెల్లడించింది. ఆసీస్ జట్టులోకి ఓ కొత్త ప్లేయర్‌ వచ్చాడు. భారత్‌-ఏతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఏకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనేకు అవకాశం దక్కింది. గాయం కారణంగా కామెరూన్‌ గ్రీన్‌ దూరమైన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజే టీమిండియా ఆసీస్ బయల్దేరనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టులో ఆడటంపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా-ఏపై ధ్రువ్‌ జురెల్‌ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాంతో పెర్త్‌ టెస్టుకు తుది జట్టులో కేఎల్ రాహుల్ కాకుండా.. జురెల్‌ను తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

తొలి టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖావాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనే, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.

భారత్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్‌ దీప్, ప్రసిధ్‌ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.