Leading News Portal in Telugu

Varun Chakaravarthy picked up a 5-wicket-haul in SA vs IND 2nd T20I


  • రెండో టీ20లో 5 వికెట్స్ తీసిన వరుణ్
  • చరిత్ర సృష్టించిన వరుణ్
  • ఐదో భారత బౌలర్‌గా రికార్డు
Varun Chakaravarthy: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. ‘ఒకే ఒక్కడు’!

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో భారత్ త‌రపున‌ ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వ‌యుష్కుడిగా వరుణ్ రికార్డుల్లోకెక్కాడు. 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. గెబేహా వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వరుణ్ 5 వికెట్స్ (5/17) తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది.

ఓవరాల్‌గా టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో యజ్వేంద్ర చహల్, దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్ (రెండుసార్లు), భువనేశ్వర్ కుమార్ (రెండుసార్లు) ఉన్నారు. ఓ టీ20 మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత స్పిన్నర్‌గా మరో రికార్డు కూడా సృష్టించాడు. ఈ జాబితాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.

మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి మాయ చేశాడు. 125 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మార్‌క్రమ్‌, క్లాసెన్‌, హెండ్రిక్స్‌, మిల్లర్‌, జాన్సెన్ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యచ్‌లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన రికార్డులను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో వరుణ్ కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన చేయడంతో భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.