Leading News Portal in Telugu

World Cup winner Munaf Patel appointed Delhi Capitals bowling coach


  • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌

  • ఈ విషయాన్ని ప్రకటించిన ఢిల్లీ ఫ్రాంచైజీ

  • మునాఫ్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు.
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్‌ను నియమించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాలరావుతో పాటు ఢిల్లీ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉంటారు. మునాఫ్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2018లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత.. కొన్ని లీగ్ టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. మునాఫ్ ఐపీఎల్‌లో కూడా ఆడాడు. 2008 నుండి 2010 వరకు రాజస్థాన్ రాయల్స్, 2011 నుండి 2013 వరకు ముంబై ఇండియన్స్, 2017 సీజన్‌లో గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2013లో ఐపీఎల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టులో మునాఫ్ సభ్యుడు.

జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్:
బౌలింగ్ కోచ్‌గా నియమితులైన తర్వాత జట్టుతో కలిసి పని చేయడం ప్రారంభించాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీని ధరించి కనిపించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో రికీ పాంటింగ్ స్థానంలో హేమంగ్ బదానీని ఢిల్లీ ప్రధాన కోచ్‌గా నియమించింది. జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్ ఢిల్లీ జట్టులోకి రానున్నాడు. పాంటింగ్ నిష్క్రమణ తర్వాత, హోప్స్ కూడా జట్టును విడిచిపెట్టాడు.

ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ట్రిస్టన్ స్టబ్స్, అన్‌క్యాప్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌లను ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ ఉంచుకుంది. వేలంలో ఢిల్లీకి రూ.73 కోట్ల పర్స్ అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్‌ గత మూడు సీజన్లలో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకోలేకపోయింది.