Leading News Portal in Telugu

South Africa vs India 3rd T20I at Centurion South Africa won the toss and elected bowling first


  • దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌ వేదికగా.
  • దక్షిణాఫ్రికాతో మూడో టీ20.
  • టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.
IND vs SA: ఆధిక్యం ఎవరు సాధిస్తారో? టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

IND vs SA: నేడు టీమిండియా టీ20 జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌ వేదికగా నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ20 జరగనుంది. ఈ దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో మొదలు పెట్టిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో తడబడి ఓటమిని చవి చూసింది. దాంతో నేడు జరిగే మూడో టీ20 కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన భావిస్తోంది. 4 టి20 మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో ఇప్పటికి 1 – 1 తో సమానంగా ఉన్నారు.

ఇక నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో ఆల్‌రౌండర్‌ రమణ్‌దీప్‌ సింగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సందర్బంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రమణ్‌దీప్‌ సింగ్‌ (Ramandeep Singh)కు క్యాప్‌ అందించాడు. టీమిండియా అవేశ్ ఖాన్ స్థానంలో రమణ్‌దీప్‌ సింగ్ మార్పుతో మ్యాచ్ ఆడనుంది. ఇక మ్యాచ్ ఆడబోతున్న జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

దక్షిణాఫ్రికా తుది జట్టు:

ర్యాన్‌ రికిల్‌టన్‌, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్‌), డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, ఆండిల్ సిమెలన్‌, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా.

భారత్ తుది జట్టు:

సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.