- బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్,
పునరాగమనం తర్వాత ఆడిన తొలి మ్యాచ్ లో సత్తా చాటిన షమీ,
మొదటి రోజు వికెట్ సాధించకపోయినప్పటికీ,
రెండో రోజు నాలుగు వికెట్లు తీసిన షమీ.
బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మహ్మద్ షమీ ఇంతకు ముందు ప్రదర్శనను కనబరిచాడు. బెంగాల్ జట్టు తరపున ఆడుతున్న షమీ.. మొదటి రోజు వికెట్ సాధించకపోయినప్పటికీ, రెండో రోజు అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 360 రోజుల విరామం తర్వాత, ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడేందుకు తిరిగి వచ్చాడు. ఇది అతని పునరాగమన మ్యాచ్.
మహ్మద్ షమీ మొత్తం19 ఓవర్లు వేశాడు. అందులో 4 ఓవర్లు మెయిడిన్లు. 54 పరుగులు వెచ్చించి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన ఆధారంగా షమీ.. టీమిండియాలో పునరాగమనంపై ఆశలు సజీవంగా ఉంచుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ లో భాగంగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. కాగా.. ఈ టెస్ట్ సిరీస్ లో షమీ చోటు దక్కాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ జట్టులో భాగమైతే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడనవ్వనున్నాడు.
ఆస్ట్రేలియా గడ్డపై షమీ రికార్డు అద్బుతంగా ఉంది. షమీ 8 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ 2023 నవంబర్ 19న టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అది 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్. ఆ మ్యాచ్ తర్వాత అతను క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతనికి కాలికి శస్త్రచికిత్స జరగడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. తాజాగా.. ఇప్పుడు అతను మైదానంలోకి అడుగుపెట్టాడు.. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి తన సత్తా చూపించాడు. అయితే ఇప్పుడు తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. షమీని ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో తీసుకునే అవకాశం కనిపిస్తోంది.