- టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్..
- ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న సిరీసే చివరిదని తెలిపిన సౌథీ..

Tim Southee: న్యూజిలాండ్ స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ టిమ్ సౌథీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు తన సారథ్యానికి గుడ్‌బై చెప్పేశాడు. తాజాగా టెస్టు ఫార్మాట్‌కే వీడ్కోలు పలికేందుకు రెడీ అయ్యాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న సిరీసే చివరిదని అతడు పేర్కొన్నాడు. హామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. అక్కడే తన ఆఖరి మ్యాచ్‌ను టిమ్ సౌథీ ఆడనున్నారు. కివీస్ తరఫున 104 టెస్టులు ఆడిన సౌథీ 2,185 రన్స్ చేశారు. బౌలింగ్‌లో 385 వికెట్లు తీసుకున్నాడు. 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయంగా 125 టీ20లు ఆడిన టీమ్ సౌథీ 303 రన్స్, 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లోనూ 54 మ్యాచుల్లో 120 పరుగులు, 47 వికెట్లు పడగొట్టాడు.
కాగా, న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పటికీ గౌరవమే అని టీమ్ సౌథీ తెలిపారు. చిన్నప్పటి నుంచి అదే కలతో పెరుగుతూ వచ్చాను.. నా కల సాకారం చేసుకోగలిగా.. నా హృదయంలో టెస్టు క్రికెట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పుకొచ్చారు. నా టెస్టు కెరీర్ ప్రారంభమైన జట్టుపైనే చివరి మ్యాచ్ ఆడబోతుండటం ఆసక్తికరమైన విషయం అని సౌథీ అన్నారు. మూడు స్టేడియాలు నాకెంతో స్పెషల్.. అందులో హామిల్టన్ మైదానంలో నా చివరి మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నాని టీమ్ సౌథీ వెల్లడించాడు.
అయితే, టిమ్ సౌథీ బౌలర్‌గానే కాకుండా.. బ్యాటింగ్‌లోనూ కీలకమైన ఇన్సింగ్స్ లు ఆడాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 2000+ రన్స్ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచారు. ఇంగ్లండ్ బ్యాటర్ డకెట్ (2,293 బంతులు) ఈ ఘనతను సాధించక ముందు వరకు సౌథీనే (2,418 బంతులు) తొలి స్థానంలో ఉండేవారు. ఇక, టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆరో ఆటగాడు సౌథీ.. ఇప్పటి వరకు అతడు మొత్తం 93 సిక్స్‌లు బాదాడు. అతడు అత్యధిక వ్యక్తిగత స్కోరు 77 పరుగులు నాటౌట్. కివీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ టీమ్ సౌథీ. అలాగే, టెస్టుల్లో అతడు 385 వికెట్లు తీసుకున్నాడు. రిచర్డ్ హ్యాడ్లీ (431) తర్వాత సౌథీ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో 3 టెస్టుల సిరీస్‌లో ఆడనున్న సౌథీ 400+ వికెట్ల క్లబ్‌లోకి చేరే ఛాన్స్ ఉంది.