Leading News Portal in Telugu

Which Indian Players Can Bat 11 Hours To Save A Test Match? Gautam Gambhir Replies


  • టెస్టు మ్యాచ్‌లో.. టీమిండియా క్రికెటర్లలో ఎవరు 11 గంటల పాటు బ్యాటింగ్‌ చేయగలరు?..
  • ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్..
  • మా జట్టులోని టాప్-7 ప్లేయర్స్ అందరు దాదాపు 11 గంటల పాటు బ్యాటింగ్ చేస్తారు: గంభీర్
Gautam Gambhir: టీమిండియా ప్లేయర్స్లో ఎవరు 11 గంటల పాటు బ్యాటింగ్‌ చేస్తారు..? గంభీర్‌ రిప్లై అదుర్స్

Gautam Gambhir: బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌ ఆడబోతుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టుతో పాటు ఉన్నారు. ఆసీస్‌పై 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటేనే భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకొనే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో జియో సినిమా ఓటీటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కోచ్ గౌతమ్‌ గంభీర్‌ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్న.. ప్రస్తుత భారత జట్టులో యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ కాకుండా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ లలో రోజంతా ఆడే సామర్థ్యం కలిగిన ప్లేయర్లు ఎవరు అని గంభీర్ ను అడిగారు. రోజంతా అంటే 11 గంటలు దాదాపు నాలుగు సెషన్ల పాటు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం ఈజీ అవుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఈ క్రమంలో 11 గంటలు బ్యాటింగ్‌ చేసే బ్యాటర్‌ విషయంలో గంభీర్‌ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు. టాప్‌ -7లోని బ్యాటర్లంతా ఆడగలరు అని చెప్పుకొచ్చాడు.

కాగా, భారత స్టార్ ద్వయం రోహిత్, విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ కౌంటర్‌ ఇచ్చినట్లైంది. ఇప్పుడు దానిపై ఆసీస్‌ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ రియాక్ట్ అయ్యారు. మాపై మానసికంగా పైచేయి సాధించేందుకు గంభీర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.. కోచ్‌గా ఆటగాళ్లకు సపోర్టుగా నిలవొచ్చు. కానీ, అలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలా కాకుండా మాపై వ్యూహాలు రెడీ చేసుకోవాలన్నారు. గతంలో ఏమైందో తెలుసు అని బ్రాడ్ హడిన్‌ పేర్కొన్నారు.