- మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో జపాన్‌ను ఓడించిన భారత్
- 2-0 తేడాతో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
- ఫైనల్‌లో చైనాతో తలపడనున్న భారత్.
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ జపాన్‌ను ఓడించింది. 2-0 తేడాతో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఫైనల్‌లో చైనాతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో తొలి 45 నిమిషాల్లో భారత్, జపాన్ ఒక్క గోల్ చేయలేకపోయాయి. గోల్స్ కోసం ఇరు జట్లు పోరాడాయి. భారత్‌కు పెనాల్టీ కార్నర్‌లు వరుసగా లభించినా వాటిని గోల్‌గా మార్చలేకపోయింది. ఈ సమయంలో భారత్‌కు 11, జపాన్‌కు ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా లభించలేదు. సెకండాఫ్‌కు ముందే సవితా పునియాను తొలగించి గోల్‌కీపింగ్ బాధ్యతలను బిచ్చు దేవికి అప్పగించింది.
తొలి మూడు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. భారత్ తరఫున నవనీత్ పెనాల్టీ స్ట్రోక్‌లో గోల్ చేయగా, సునేలిత, లాల్‌రెమ్సియామి రెండో గోల్ చేశారు. ఈ క్రమంలో.. జపాన్ పై రెండు గోల్స్ తో విజయం సాధిచింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్ ఇప్పుడు చైనాతో తలపడనుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌లో చైనా 3-1తో మలేషియాను ఓడించి ఫైనల్‌కు టికెట్ ఖాయం చేసుకుంది. గ్రూప్ రౌండ్‌లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. చివరి గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లో జపాన్‌తో తలపడింది. అప్పుడు కూడా భారత్ 3-0తో గెలిచింది. 48 గంటల్లోనే ఇరు జట్లు మరోసారి ముఖాముఖి తలపడ్డాయి.