- మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం
- విదేశీ ఆల్ రౌండర్లపై
- ఐపీఎల్ ఫ్రాంచైజీల కళ్లు
IPL 2025 Auction: మరో రెండు రోజుల్లో రెండు రోజులపాటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం జరగనుంది. ఈ వేలంలో ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు తమ జట్టుకు సరిపోయే ఆల్ రౌండర్లుగా సహకరించగల క్రికెటర్లను జోడించాలనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో ఫ్రాంచైజీలు ఎక్కువ డబ్బుతో స్టార్ ఆల్ రౌండర్లను టీంలోకి తీసుక రావాలి అనుకుంటున్నాయి. దింతో ఇప్పుడు భారత ఆల్ రౌండర్లతో పాటు విదేశీ ఆల్ రౌండర్లకు కూడా మంచి గిరాకీ ఉంది. మరి ఏ విదేశీ ఆల్ రౌండర్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల మదిలో ఉన్నారో ఒకసారి చూద్దాం.
ఈ లిస్ట్ లో మొదటగా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ను ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. స్టోయినిస్ 98 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 9 హాఫ్ సెంచరీలతో 1866 పరుగులు చేశాడు. అతడు 43 వికెట్లు కూడా నేలకూల్చాడు. దింతో ఫ్రాంచైజీల చూపు అతడిపై పడింది. ఈ లిస్ట్ లో మరో ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్. ఈయన విషయానికి వస్తే.. అన్ని ఫ్రాంచైజీలు ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌పై దృష్టి పెట్టనున్నాయి. పంజాబ్ కింగ్స్ ఈసారి అతన్ని విడుదల చేసింది. అతను ఇప్పటివరకు 39 ఐపిఎల్ మ్యాచ్‌లలో 6 అర్ధ సెంచరీల సహాయంతో 939 పరుగులు చేశాడు అలాగే 11 వికెట్లు కూడా నేలకూల్చాడు.
ఇక ఈ లిస్ట్ లో మరో ఆటగాడు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేయలేదు. దాంతో ఈసారి అతనిని దక్కించుకోవాలని వేయడానికి చాలా పెద్ద ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఫిలిప్స్ 8 మ్యాచ్‌ల్లో 65 పరుగులు చేసి 2 వికెట్లు కూడా తీశాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి అతన్ని విడుదల చేసింది. గ్రీన్ 29 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 707 పరుగులు చేశాడు. ఇది కాకుండా, అతను బంతితో 16 వికెట్లు కూడా తీసుకున్నాడు. అలాగే వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ రోవ్‌మాన్ పావెల్‌ను ఈసారి రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసింది. అతను 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1 అర్ధ సెంచరీతో 360 పరుగులు చేశాడు. ఇతనిపై కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.