Leading News Portal in Telugu

Hardik Pandya Played crucial innings in syed mushtaq ali trophy details are


  • 8 ఏళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో
  • మరోసారి రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా.
  • వివరాలు ఇలా.
Hardik Pandya: 8 ఏళ్ల తర్వాత మరోసారి రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా

Hardik Pandya syed mushtaq ali trophy: హార్దిక్ పాండ్యా ఎక్కడికి వెళ్లినా ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మైదానం ఏదయినా, ప్రత్యర్థి ఎవరన్నా పట్టించుకోని పాండ్యా కేవలం తన జట్టును గెలిపించుకోవడంపైనే దృష్టి సారించాడు. మరోసారి పాండ్యా అదే చేశాడు. 8 ఏళ్ల తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడుతున్న హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లోనే అద్భుతం చేశాడు. పాండ్యా అజేయ అర్ధ సెంచరీతో తన జట్టుకు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. బరోడా తరఫున ఆడిన హార్దిక్ పాండ్యా అజేయంగా 74 పరుగులు చేశాడు. దింతో ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే అతని జట్టు విజయం సాధించగలిగింది.

ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. లక్ష్యం పెద్దది కావడంతో.. ఒకానొక సమయంలో గుజరాత్ జట్టు విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినా ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి ఒంటి చేత్తో తన టీంను విజయతీరాలకు చేర్చాడు. ఐదో స్థానంలో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఐదు సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒత్తిడితో కూడిన సమయంలో పాండ్యా ఈ ఇన్నింగ్స్ ఆడాడు. దాని ఫలితంగా బరోడా మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఇక మరోవైపు, గుజరాత్ జట్టులో ఇద్దరు పెద్ద ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ జట్టులో ఉన్నారు. కానీ, ఇద్దరూ గుజరాత్‌కు మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు.

ఇకపోతే, బుధవారం నాడు హార్దిక్ పాండ్యా నంబర్ 1 టీ20 ఆల్ రౌండర్ అయ్యాడు. లియామ్ లివింగ్‌స్టన్‌ను దాటి ఈ స్థానాన్ని సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నంబర్ 1 ఆల్‌రౌండర్‌లా పాండ్యా ప్రదర్శన ఇచ్చాడు. అయితే పాండ్యా బౌలింగ్‌లో కొంచెం భారీగానే పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్‌లో ఆడడం ద్వారా IPL 2025 కోసం తన సన్నాహాలను పూర్తి చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.