Leading News Portal in Telugu

Adelaide pitch curator talks conditions for 2nd Test 6mm grass on pitch full details are


  • బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ముందంజలో టీమిండియా.
  • టీమిండియా జోరుకు బ్రేక్‌లు వేసేందుకు ఆస్ట్రేలియా కుట్ర
  • వివరాలు ఇలా
AUS vs IND: టీమిండియా జోరు.. బ్రేక్‌లు వేసేందుకు ఆస్ట్రేలియా కుట్ర

AUS vs IND: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఉన్న టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ముందంజలో ఉంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 295 పదవుల భారీ విజయాన్ని అందుకోగా తన తర్వాతి మ్యాచ్ ను అడిలైడ్ వేదికగా ఆడనుంది. డే అండ్ నైట్ టెస్ట్ లో భాగంగా పింక్ బాల్ తో మ్యాచ్ జరగనుంది. ఇకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్ విజయం తర్వాత జోరు మీదున్న టీమిండియాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా భారీ కుట్రను చేసినట్లుగా అర్థమవుతోంది. ఎలాగైనా ఈ టెస్ట్ మ్యాచ్లో గెలవాలన్న నెపంతో ఆసీస్ పచ్చిక మైదానాన్ని ఏర్పాటు చేసింది. 2020లో ఇదే గ్రౌండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ టెస్టులో భారత్ కేవలం 36 పరుగులకు ఆల్ అవుట్ అయిందన్న విషయం తెలిసిందే. దింతో మరోసారి అదే తీరును కొనసాగించేందుకు కుట్ర జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం పిచ్ పై ఆరు మీటర్ల గడ్డి ఉందని గ్రౌండ్ హెడ్ క్యూరేటర్ డామియల్ హాగ్ తెలిపారు. ఇలా చేయడం వల్ల కొట్టడానికి సమయంలో ఫ్లెడ్ లైట్ల కింద బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఇదివరకు లాగే పరిస్థితులు ఇప్పుడు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. పచ్చిక ఎక్కువగా ఉండి తేమ శాతం అధికంగా ఉంటుందని, దీంతో పిచ్ కాస్త పొడిగా అలాగే కఠినంగా మారుతుందని ఆయన తెలిపాడు. అయితే, పిచ్ రోజులు గడుస్తున్నా కొద్ది స్పిన్నర్లు కూడా ప్రభావం చూపగలరని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికి పిచ్ పై ఏడు మిల్లీమీటర్ల ఎత్తున గడ్డి ఉందని దాన్ని ఆరు మిల్లీమీటర్లకు తగ్గిస్తామని ఆయన అన్నారు. కొత్త బంతితో అయితే బ్యాటర్లు ఇబ్బంది పడతారని, అయితే పాత బంతితో మాత్రం బ్యాటర్లు మంచి స్కోర్లు సాధిస్తారని డామియల్ హాగ్ తెలిపారు.