Leading News Portal in Telugu

Former Players Michael Atherton and Nasser Hussain Predict Champions Trophy 2025 Winning Team


  • 2025 ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్, యుఏఈలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం
  • ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి చెప్పిన మాజీ ఆటగాళ్లు.
Champions Trophy 2025: ఇండియాకు నో ఛాన్స్.. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచేది ఆ జట్టే..?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్, యుఏఈలో ప్రారంభం కానుంది. రాజకీయ సమస్యల కారణంగా టీమిండియా తన అన్ని మ్యాచ్‌లను యుఏఈలో ఆడనుంది. ఒక సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా యూఏఈలో జరుగనుంది. అయితే.. ఫైనల్‌ వేదిక ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ భారత్‌ టైటిల్‌ మ్యాచ్‌లోకి ప్రవేశిస్తే ఆ మ్యాచ్‌ యూఏఈలో జరుగనుంది. వేరే ఏదైనా జట్లు ఫైనల్‌కు వస్తే పాకిస్థాన్‌ ఆతిథ్యమిస్తుంది. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీకి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది.. ఈ క్రమంలో జట్లను అంచనా వేయడంతో పాటు విజేత ఎవరనే దానిపై నిపుణులు అంచనాలు వేయడం ప్రారంభించారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతల గురించి ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ తమ అంచనాలను వెల్లడించారు. మైఖేల్ అథర్టన్ మాట్లాడుతూ.. ” దక్షిణాఫ్రికాకు మద్ధతిస్తున్నాను. ప్రతి టోర్నమెంట్‌లో గెలిచే వరకు పోరాడతారు. సౌతాఫ్రికా జట్టు బలంగా ఉంది. ఈ ట్రోఫీని దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంటుంది.” అని మైఖేల్ అథర్టన్ తెలిపాడు. మాజీ ఇంగ్లీష్ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈసారి భారత్, ఆస్ట్రేలియాలు ఫైనల్‌కు చేరుకుంటాయని అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా.. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఆస్ట్రేలియా జట్టును నాసిర్ ప్రకటించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆస్ట్రేలియా, భారత్‌లు రెండుసార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి. 2000లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచిన భారత్, 2013లో ధోనీ సారథ్యంలో టైటిల్‌ను గెలుచుకోవడంలో విజయం సాధించింది. అంతే కాకుండా రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకోవడంలో ఆస్ట్రేలియన్ జట్టు విజయం సాధించింది. 2006లో తొలిసారిగా, 2008లో రెండోసారి టైటిల్‌ను గెలుచుకోవడంలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది.