Leading News Portal in Telugu

Neeraj Chopra got married.. Photos viral


  • వివాహం చేసుకున్న నీరజ్ చోప్రా
  • పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్
  • సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి.
Neeraj Chopra: పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్

భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం వివాహం చేసుకున్నారు. అతను తన కుటుంబంతో కలిసి కనిపించిన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్టర్ లో పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశారు. దానికి నీరజ్-హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా.. “జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను” అని రాశారు.