Leading News Portal in Telugu

Karun Nair should have been picked as a standby: Harbhajan Singh


  • ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన..
  • దేశవాళీలో అదరగొట్టిన కరుణ్‌ నాయర్‌ను స్టాండ్‌బై ప్లేయర్గా తీసుకోవాల్సింది..
  • మంచిగా ఆడే ప్లేయర్లను పట్టించుకోకపోతే రంజీ మ్యాచ్‌ల ప్రాముఖ్యత ఏముంటుంది: భజ్జీ
Champions Trophy 2025: కరుణ్ నాయర్‌ను కనీసం స్టాండ్‌బై ప్లేయర్గా తీసుకోవాల్సింది..

Champions Trophy 2025: వచ్చే నెలలో ప్రారంభం అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమిండియా టోర్నీలో పాల్గొంటుంది. ఇక, వైస్ కెప్టెన్‌గా గిల్‌కు ఛాన్స్ వచ్చింది. అయితే, దేశవాళీలో అదరగొట్టిన కరుణ్‌ నాయర్‌పై బీసీసీఐ ఇంట్రెస్ట్ చూపించలేదు. కేవలం 8 మ్యాచుల్లో ఐదు సెంచరీలతో 779 రన్స్ చేసిన అతడిని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హర్భజన్‌ సింగ్‌ కూడా రియాక్ట్ అయ్యాడు. 15 మంది స్క్వాడ్‌లో ఛాన్స్ ఇవ్వకపోయినా.. కనీసం స్టాండ్‌బై ప్లేయర్ గా తీసుకున్నా బాగుండేదని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

భారత జట్టును ఎంపిక చేయడమంటే సెలక్టర్లకు చాలా కష్టమైన పని.. అందులో 15 మందితో స్క్వాడ్‌ అంటే ఇంకా ఇబ్బందిగా ఉంటుదని భజ్జీ చెప్పుకొచ్చాడు. కానీ, దేశవాళీలో అదరగొట్టిన వారికి అవకాశం కూడా కల్పించకపోలేకపోయారని వాపోయాడు. ఎవర్నీ తీసుకోవాలి.. ఎవర్నీ పక్కన పెట్టాలనేది? నిర్ణయించడం చాలా కష్టమని నేనూ అంగీకరిస్తా అని అతడు పేర్కొన్నాడు. కానీ, కరుణ్ నాయర్‌ లాంటి ప్లేయర్‌ సరిగ్గా ఆడకపోతే క్వశ్చన్ చేసేవాడిని కాదు.. అతడు అద్భుతంగా ఆడుతున్నాడు.. కనీసం అలాంటి ఆటగాళ్లకు అదనపు ప్లేయర్స్ లిస్టులో తీసుకోవాల్సిందని హర్భజన్ సింగ్ అన్నాడు.

ఇలా, అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్లేయర్లను ఎంపిక చేయకపోతే.. రంజీ మ్యాచ్‌ల ప్రాముఖ్యత ఏముంటుంది? అని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ క్రికెటర్ ఎవరైనా ఫామ్‌లో లేకపోతే జట్టు నుంచి తప్పించి.. దేశవాళీలో ఆడిన తర్వాత ఫామ్‌లోకి వస్తేనే మళ్లీ టీమ్ లోకి తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వారి ఆటను అస్సలు చూడటం లేదు.. వెంటనే, కరుణ్‌నాయర్‌ను స్టాండ్‌బై ప్లేయర్ గా తీసుకుంటున్నట్లు ప్రకటించాలని భజ్జీ తెలిపాడు.