Leading News Portal in Telugu

Mohammed Shami’s return to India’s squad as a significant boost: Ganguly


  • ఛాంపియన్స్‌ 2025 ట్రోఫీ ముంగిట మహ్మద్ షమీ పునరాగమనం..
  • షమీ రీ ఎంట్రీతో సంతోషం వ్యక్తం చేసిన సౌరభ్ గంగూలీ..
  • షమీ రాకతో బుమ్రాపై ఒత్తిడి తగ్గుతుంది.. టీమిండియా బలం పెరుగుతుంది: గంగూలీ
Sourav Ganguly: మహ్మద్‌ షమీ రాకతో బుమ్రాపై ఒత్తిడి తగ్గుతుంది!

Sourav Ganguly: ఏడాది కాలంగా టీమిండియాకు దూరంగా సీనియర్ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ త్వరలో మరోసారి భారత జెర్సీలో కనిపించనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ తర్వాత గాయంతో ఆటకు దూరమైన షమీ కీలకమైన ఛాంపియన్స్‌ 2025 ట్రోఫీ ముందట పునరాగమనం చేయబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్, వన్డే సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీకి అతడు ఎంపికయ్యాడు. షమీ రీ ఎంట్రీ ఇస్తుండటంతో టీమిండియా మాజీ ప్లేయర్ సౌరభ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేశారు. అతడి రాకతో భారత జట్టు బలం గణనీయంగా పెరిగిందన్నారు.

ఇక, మహ్మద్ షమీ ఫిట్‌గా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని సౌరభ్ గంగూలీ పేర్కొన్నారు. ఎందుకంటే జస్‌ప్రీత్‌ బుమ్రా తర్వాత దేశంలోనే అత్యుత్తమ బౌలర్ అతను అని చెప్పుకొచ్చారు. షమీ కాస్త భయాందోళనతో ఉంటాడు.. మోకాలి గాయం నుంచి కోలుకొని చాలా కాలం తర్వాత క్రికెట్ ఆడబోతున్నాడు.. కాబట్టి, దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌ తరఫున ఆడటం అతడికి కలిసొచ్చే అంశం అని పేర్కొన్నాడు. ఆ అనుభవం రాబోయే మ్యాచ్‌ల్లో అతడికి ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించాడు. మహ్మద్ షమీ రావడంతో బుమ్రాపై వర్క్‌లోడ్ తగ్గుతుందని ఈ సందర్భంగా చెప్పాడు. వీరి ఇద్దరి ప్రదర్శనతో జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. బుమ్రా ఒక ఎండ్‌ నుంచి, షమీ మరో ఎండ్‌ నుంచి బౌలింగ్ చేయడం ఇతర జట్లకు పెను సవాల్ గా మారనుంది. పరస్పర సహకారంతో ఇద్దరు టెస్టు క్రికెట్‌లో విజయం సాధించారని గంగూలీ తెలిపారు.