Leading News Portal in Telugu

India vs Malaysia India Secures Dominant 10-Wicket Win Over Malaysia in U19 Womens T20 World Cup


  • ప్రపంచకప్‌లో రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా.
  • అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో మలేషియాతో టీమిండియా ఢీ .
  • కేవలం 17 బంతుల్లోనే 10 వికెట్ల తేడాతో మలేషియాపై టీమిండియా విజయం.
India vs Malaysia: ప్రపంచకప్‌లో రికార్డులు సృష్టిస్తున్న టీమిండియా.. 17 బంతుల్లో ఖేల్ ఖతమ్

India vs Malaysia: అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ కౌలాలంపూర్‌లోని బ్యుమాస్ ఓవల్‌లో జరిగింది. మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కేవలం 17 బంతుల్లోనే 10 వికెట్ల తేడాతో మలేషియాపై టీమిండియా విజయం సాధించింది. మలేషియా జట్టు కేవలం 14.3 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరపున వైష్ణవి శర్మ కేవలం 5 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకోవడంతో మలేషియా ఎక్కువ సేపు నిలబడలేక పోయింది. మలేషియా తరుపున నలుగురు బ్యాట్స్మెన్స్ డక్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత టీమ్ ఇండియా 2.5 ఓవర్లలోనే స్వల్ప లక్ష్యాన్ని చేధించింది. ఇక మ్యాచ్ లో టీమిండియా తరఫున ఓపెనర్ జి త్రిష 12 బంతుల్లో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం రెండో మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా 8 పాయింట్లతో గ్రూప్ 1లో మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ ఐసీసీ అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025ను స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ ఛానెల్‌లలో టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.