Leading News Portal in Telugu

Chahal’s Career Has Been finished By BCCI And Team Management: Aakash Chopra


  • టీమిండియా మేనేజ్‌మెంట్‌ తీరుతో యుజ్వేంద్ర చాహల్‌ కెరీర్‌ ముగిసినట్లే..
  • గత రెండేళ్ల నుంచి జాతీయ జట్టులో యూజీకి అవకాశం ఇవ్వడం లేదు..
  • నిలకడగా వికెట్లు తీస్తున్నాడు.. కానీ, జట్టులోకి మాత్రం తీసుకోవడం లేదు: ఆకాశ్ చోప్రా
Yuzwendra Chahal vs BCCI: బీసీసీఐ తీరుతో యూజీ కెరీర్‌ ముగిసిపోయినట్లే: ఆకాశ్‌ చోప్రా

Yuzwendra Chahal vs BCCI: ఈ నెల 18వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కార్ ప్రకటించారు. ఫిబ్రవరి 19 నుంచి ఈ ఐసీసీ టోర్నీ స్టార్ట్ కానుంది. ఇందులో రోహిత్ శర్మ నేతృత్వంలోనే టీమిండియా బరిలోకి దిగబోతుంది. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు మహ్మద్ షమీ రెడీ అయ్యాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్‌దీప్‌ యాదవ్‌కు ఛాన్స్ రావడంతో యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కకు పెట్టింది. గతంలో మంచి ప్రదర్శన చేసినా అతడికి ఛాన్స్ ఇవ్వకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. చాహల్‌ కెరీర్‌ దాదాపు ముగిసిపోయేలా చేశారని ఆరోపించాడు. గత రెండేళ్ల నుంచి అతడికి జాతీయ జట్టులో స్థానం కల్పించకపోవడం ఏంటని ప్రశ్నించారు.

అయితే, బీసీసీఐ యుజ్వేంద్ర చాహల్‌ కెరీర్‌ను దాదాపుగా క్లోజ్‌ చేసింది.. అలా ఎందుకు జరిగిందనేది అర్థం చేసుకోవడం కష్టమే అన్నారు ఆకాశ్ చోప్రా. ఇక, యూజీ చివరిసారిగా 2023 జనవరిలో వన్డే మ్యాచ్‌లో ఆడాడు. అప్పటి నుంచి నేటి వరకు అతడు ఆడలేదు. చహల్ బౌలింగ్ గణాంకాలు చాలా బాగున్నాయి.. నిలకడగా వికెట్లు తీస్తున్నాడు.. కానీ, జట్టు యజమాన్యం ఎందుకు ఛాన్స్ లు ఇవ్వడం లేదో తెలియాల్సి ఉందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపారు.

ఇక, లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన రిషభ్‌ పంత్‌కు ఆకాశ్‌ చోప్రా శుభాకాంక్షలు చెప్పాడు. ఆ జట్టును సరైన దారిలో నడిపిస్తాడని కోరాడు. టీమ్‌ మంచికి ఏది అవసరమైతే దానిని పంత్ చేయాలన్నారు. రిషభ్‌ తో పాటు ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా ఆలోచనలూ ఒకేలా ఉంటాయన్నారు. బౌలింగ్‌ పరంగా పెద్దగా ఇబ్బందులేదు కానీ, బ్యాటింగ్‌లోనే ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా మారిందన్నాడు. ఇక, ఐపీఎల్ మెగా వేలంలో రిషభ్‌ పంత్‌ను ఎల్‌ఎస్‌జీ రూ. 27 కోట్లకు దక్కించుకుంది.