Leading News Portal in Telugu

PAK vs WI West Indies Clinch Historic 120-Run Victory Over Pakistan in Multan


  • పాక్ గడ్డపై 35 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ విజయం.
  • పాకిస్తాన్‌పై 120 పరుగుల తేడాతో వెస్టిండీస్ విజయం.
PAK vs WI: పాక్ గడ్డపై 35 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ సంచలనం

PAK vs WI: ముల్తాన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పాకిస్తాన్‌పై 120 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో కేవలం సిరీస్‌ను గెలుచుకోవడమే కాదు. 35 ఏళ్ల తర్వాత ముల్తాన్‌లో సుల్తాన్ గా పేరొందిన పాకిస్తాన్ జట్టుకు సొంత గడ్డపై వెస్టిండీస్ జట్టు చుక్కలు చూపించింది. 1990 తర్వాత పాక్ గడ్డపై వెస్టిండీస్ గెలిచిన ఇదే తొలి టెస్టు కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగింది. సొంత మైదానం, అనుకూల పిచ్ పరిస్థితులున్నప్పటికీ పాక్ జట్టు కరీబియన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. పాక్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇక ఈ టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దానితో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 163 పరుగులకే ఆలౌటైంది. దీనికి సమాధానంగా పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా తేలిపోయింది. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 154 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్టిండీస్ 9 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్ జట్టు 244 పరుగుల మోస్తరు స్కోర్ చేయడం ద్వారా పాకిస్తాన్ ముందు 254 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే లక్షాన్ని చేధించే క్రమంలో పాకిస్తాన్‌ కేవలం 133 పరుగులకే కుప్పకూలింది. దీనితో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వెస్టిండీస్ పాక్ గడ్డపై ఘనత సాధించడమే కాకుండా, 2 టెస్టుల సిరీస్‌ను 1-0 తో సిరీస్ను కైవసం చేసుకుంది.