Leading News Portal in Telugu

Champions Trophy tickets to be released from tomorrow


  • ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం
  • రేపటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫి టికెట్లు విడుదల
Champions Trophy 2025: రేపటి నుంచే ఛాంపియన్స్ ట్రోఫి టికెట్లు విడుదల.. టీమిండియా ఫ్యాన్స్ కు షాక్!

వరల్డ్ వైడ్ గా క్రికెట్ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పనులన్నీ వదులుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. మ్యాచ్ ఎక్కడ జరిగినా స్టేడియాల్లో వాలిపోతుంటారు. క్రికెట్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్నది. పాకిస్థాన్ , దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ ఈవెంట్ కు సంబంధించిన టికెట్ల వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ జనవరి 27న ప్రకటించాయి.

ఈ టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్ లు, పాకిస్తాన్ లో జరిగే రెండవ సెమీ ఫైనల్ టికెట్స్ జనవరి 28న మధ్యాహ్నం 2 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. పాక్ లో సాధారణ స్టాండ్ ల టిక్కెట్ ల ధర రూ. 1000( భారత కరెన్సీ ప్రకారం రూ. 310గా నిర్ణయించారు. అయితే టీమిండియా ఫ్యాన్స్ కు మాత్రం షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే దుబాయ్ వేదికగా జరిగే భారత మ్యాచ్ లకు సంబంధించిన టికెట్ల వివరాలను వెల్లడించలేదు. ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి ఫిజికల్ టికెట్స్ ఫిబ్రవరి 3 నుంచి పాకిస్థాన్ లోని టీసీఎస్ ఎక్స్ ప్రెస్ సెంటర్లలో ఇవ్వనున్నారు. హైబ్రిడ్ మోడ్ లో ఈ టోర్నీ జరుగనున్నది.