Leading News Portal in Telugu

England win over India in third T20


  • మూడో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి
  • మూడో టీ20లో భారత్‌ పై ఇంగ్లాండ్ గెలుపు
Ind vs Eng 3rd T20: వరుణ్ చక్రవర్తి మెరిసినా.. మూడో టీ20లో భారత్‌కు తప్పని ఓటమి

భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 రసవత్తరంగా సాగింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన ఈమ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. వరుణ్ చక్రవర్తి మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడినా ఓటమి తప్పలేదు. సిరీస్ పై కన్నేసిన భారత్ కు నిరాశ తప్పలేదు. మూడోటీ20లో భారత్ పై ఇంగ్లాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 09 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి భారత్ కు 172 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ లో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది.

హార్థిక్ పాండ్య 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు బాది 40 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సంజూశాంసన్ 3, అభిషేక్ శర్మ 24, సూర్య కుమార్ యాదవ్ 14, తిలక్ వర్మ 18, వాషింగ్టన్ సుందర్ 6,అక్షర్ పటేల్ 15, ధ్రువ్ జురెల్ 2, మహ్మద్ శమీ 7, రవి బిష్ణోయ్ 4, వరుణ్ చక్రవర్తి 1 పరుగులు సాధించారు.ఇంగ్లండ్ బౌలర్లలో జామి ఓవర్టన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బ్రైడెన్ కార్సే తలో రెండు వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశారు.

వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 5 మంది ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లను పడగొట్టాడు. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ 28 బంతుల్లో అత్యధికంగా 51 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 22 బంతుల్లో 24 పరుగులు సాధించాడు. భారత్ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ జనవరి 31న పూణేలో జరుగనుంది.