Leading News Portal in Telugu

Talent like Sanju Samson must be allowed a long patch of failures: Sanjay Manjrekar


  • ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో వరుసగా విఫలమైతున్న సంజు శాంసన్..
  • సంజు శాంసన్ కు వరుస అవకాశాలు ఇవ్వాలని కోరిన టీమిండియా మాజీ క్రికెటర్..
  • సంజు ఫామ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు: సంజయ్ మంజ్రేకర్
Sanju Samson: సంజు శాంసన్ ఫామ్‌లోకి వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు..

Sanju Samson: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ పెద్దగా రాణించడం లేదు. స్టార్టింగ్ లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి ప్రత్యర్థి బౌలర్లకు వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ సంధించే షార్ట్‌ పిచ్‌ బాల్స్ కు బౌండరీ లైన్‌ దగ్గర సంజు దొరికిపోతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఇంగ్లాండ్ తో ఐదో టీ20 మ్యాచ్‌ను భారత్ ఆడనుంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ కు సంజును పక్కన పెడతారనే వార్తలు వస్తున్నాయి.. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ రియాక్ట్ అయ్యాడు. సంజు శాంసన్ కు అవకాశాలు ఇస్తూనే ఉండాలని పేర్కొన్నాడు.

ఎందుకంటే, సంజు మంచి ఫామ్‌లో ఉంటే అతడిని ఆపడం ఎవరి తరం కాదని సంజయ్ మంజ్రేకర్ వెల్లడించారు. బ్యాటింగ్‌తో టీమ్ ను విజయపథంలో నడిపంచనున్నాడని తెలిపారు. అలాంటి ప్లేయ్ విఫలమైనప్పుడు సపోర్ట్ ఇవ్వాలన్నారు. ఛాన్స్ లు ఇస్తుంటే.. తిరిగి ఫాంలోకి వస్తారని చెప్పాడు. టీ20 క్రికెట్‌లో జట్టు కోసం రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటది.. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్‌లోనూ అతడు దూకుడుగా ఆడేందుకు ట్రై చేసి పెవిలియన్‌కు చేరుతున్నాడు.. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని పేర్కొన్నాడు. ఇతర ప్లేయర్‌లు ఫామ్‌ కోల్పోయినా వారికి ఛాన్స్‌లు ఇస్తారు.. ఏదైక ఒక మ్యాచ్‌లో 40 లేదా 50 రన్స్ కొడితే చాలు అనుకొంటారు.. కానీ, సంజు శాంసన్ విషయంలో మాత్రం ఎందుకు ఓర్పు ప్రదర్శించలేరని సంజయ్ మంజ్రేకర్ ప్రశ్నించారు.