Leading News Portal in Telugu

Team India captain Suryakumar Yadav failed in the series with England


  • ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా సిరీస్ కైవసం
  • ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్
  • ఈ సిరీస్‌లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసిన సూర్య
  • సూర్య కెరీర్‌లో చెత్త రికార్డు.
Team India: కెప్టెన్‌గా ఉంటే మరీ ఇలా ఆడుతారా..! చెత్త రికార్డ్

ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. 4-1 ఆధిక్యంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించాడు. అయితే ఈ సిరీస్‌లో సూర్య కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు. ఇది సూర్య కెరీర్‌లో చెత్త రికార్డు. రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో దూకుడుగా ఆడిన సూర్యకుమార్.. మిస్టర్ 360 అనే పేరును కూడా తెచ్చుకున్నాడు. అయితే.. తన కెప్టెన్సీలో ఏ మాత్రం పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు.

సూర్యకుమార్ టీ20 కెప్టెన్ గా వ్యవహరిస్తున్నప్పటి నుంచి అతని బ్యాటింగ్ తీరులో తేడా కనిపిస్తోంది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో కూడా విఫలమయ్యారు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 26 పరుగులు చేయగా.. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో 28 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్‌లో అతని సగటు 5.60. ఇంతకు ముందు కూడా సూర్యకుమార్ యాదవ్ టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా అత్యల్ప సగటును కలిగి ఉన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై 8.66 సగటుతో పరుగులు చేశాడు. దీంతో అతని రికార్డు మరింత దారుణంగా మారింది.

ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. 2022లో దక్షిణాఫ్రికాపై 14.33 సగటుతో 43 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ కూడా ఆ సంవత్సరం కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్యాట్స్‌మెన్‌గా అతని సగటు 14.50. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్య కెప్టెన్సీ బాధ్యతలు బాగానే నిర్వర్తిస్తున్నప్పటికీ.. బ్యాట్‌తో నిరాశపరుస్తున్నాడు. గత కొన్ని సిరీస్‌ల నుంచి సూర్యకుమార్ మూడో నంబర్‌లో ఆడినా, నాలుగో నంబర్‌లో ఆడినా.. ప్రతిసారీ ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మరోవైపు.. తిలక్ వర్మ మూడో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.