- అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లు
- ఐసీసీ (ICC) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రకటన
- భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు.
అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో సత్తా చాటిన 12 మంది ఆటగాళ్లతో ఐసీసీ (ICC) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి త్రిషతో పాటు కమలిని, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ చోటు దక్కించుకున్నారు. టోర్నీలో 11 వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా క్రికెటర్ కైలా రేనెకే కెప్టెన్‌గా మొత్తం 12 మందితో ఐసీసీ టీమ్‌ను ప్రకటించింది.
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 11.2 ఓవర్లలోనే 83 పరుగుల టార్గెట్‌ను భారత్ బ్యాటర్లు రీచ్ అయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ భారత జట్టు దుమ్మురేపింది. మరోవైపు.. బ్యాటింగ్, బౌలింగ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టింది. 32 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది త్రిష. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లతో రాణించింది త్రిష. వైష్ణవి శర్మ, అయూష్ శుక్లా, పరునికా సిసోడియా తలా రెండు వికెట్లు తీశారు.
జట్టు: త్రిష, బోథా (సౌతాఫ్రికా), పెర్రిన్ (ఇంగ్లాండ్), కమలిని, కావోయిహ్మ్ బ్రే (ఆస్ట్రేలియా), పూజా మహతో (నేపాల్), కైలా రేనెకే (కెప్టెన్, సౌతాఫ్రికా), కేటీ జోన్స్ (ఇంగ్లాండ్), ఆయుషి శుక్లా, చమోడి ప్రబోధ (శ్రీలంక), వైష్ణవి శర్మ, తాబిసెంగ్ (సౌతాఫ్రికా).