Leading News Portal in Telugu

MS Dhoni’s Signature Style Takes Over His Ranchi House with No. 7 and Helicopter Shot


  • రాంచీలో ధోనీకి అద్భుతమైన ఫామ్‌హౌస్
  • సెల్ఫీ స్పాట్‌గా మారిన హర్ములో బంగ్లా
  • ఇంటి బయట గోడపై జెర్సీ నంబర్ 7
  • ఐకానిక్ హెలికాప్టర్ షాట్‌తో కూడిన డిజైన్.
Dhoni House: ధోనీ ఇళ్లు డిజైన్ చూశారా.. గోడపై జెర్సీ నెంబర్ 7, హెలికాప్టర్ షాట్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను క్రికెట్‌లో సాధించిన విజయాలు ఎన్నో.. ఆయనను చూడటానికి అభిమానులు ఎక్కడికైనా సరే వెళ్తారు. ధోని క్రికెట్ ఆడుతున్నాడంటే ఏ స్టేడియానికైనా వెళ్లే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయనకు రాంచీలో అద్భుతమైన ఫామ్‌హౌస్.. హర్ములోని ధోని బంగ్లా ఉంది. దానిని చూస్తే మతిపోవాల్సిందే.. అది ఇప్పుడు సెల్ఫీ స్పాట్‌గా మారింది.

అతని ఇంటి బయట గోడపై జెర్సీ నంబర్ 7.. దానితో పాటు ఐకానిక్ హెలికాప్టర్ షాట్‌తో కూడిన డిజైన్ తయారు చేయించాడు. ఎంఎస్ ధోని క్రికెట్ ఆడే సమయంలో అతని జెర్సీ 7వ నెంబర్ ఉండటం మనకు తెలిసిందే.. అంతేకాకుండా.. క్రికెట్ ఆడినప్పుడు తాను కొట్టిన హెలికాప్టర్ షాట్ ఎంత హైలెట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని నుంచి వచ్చిన ఈ హెలికాప్టర్ షాట్‌ను ఆడటానికి చాలా మంది క్రికెటర్లు ప్రయత్నం చేశారు. కానీ.. ధోనిలా ఆడటం ఏ ఆటగాడి వల్ల కాలేదు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా మాజీ భారత కెప్టెన్‌కు నివాళిగా 7వ నంబర్ జెర్సీని రిటైర్ చేసిన సంగతి తెలిసిందే.. ధోనీకి 7వ నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌‌లో ఎప్పుడూ అతడు 7వ నంబర్ జెర్సీనే ధరించాడు. అయితే.. ధోని నివాసంలో ధోని హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్‌లు, 2007 ప్రపంచ టీ20లో ఆయన గెలిచిన పోస్టర్, 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆయన కొట్టిన చివరి సిక్స్ వంటి డిజైన్లకు సంబంధించి మరొక గోడ కూడా ఉంది.

ఇండియా టుడే నివేదిక ప్రకారం.. ఈ రాంచీ నివాసాన్ని నిర్మించడానికి భూమిని జార్ఖండ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు 2009లో ధోనికి ఇచ్చింది. ఈ నివాసం ఇప్పుడు అభిమానులకు సెల్ఫీ స్పాట్‌గా మారింది. అయితే.. ప్రస్తుతం ధోని రాంచీలోని సిమ్లియాలో తన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నాడు. ధోని జూలై 7న జన్మించాడు.. జూలై కూడా ఏడవ నెల. ఈ కారణంగా అతడు ఎప్పుడూ 7వ నంబర్ జెర్సీని ధరించేవాడు. అలాగే, ధోనికి “సెవెన్” అనే లైఫ్ స్టైల్ బ్రాండ్ కూడా ఉంది.