- ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ
- వ్యక్తిగత కారణాలతో స్టార్క్ ఔట్
- ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే
![Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే! Champions Trophy 2025: ఐదుగురు స్టార్స్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు ఇదే!](https://telugu.ebmnews.com/wp-content/uploads/2025/02/Australia-Squad.jpg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఏకంగా ఐదుగురు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాల కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, పేసర్ జోష్ హేజిల్‌వుడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వైదొలగగా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో స్టార్క్ టోర్నీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో 15 మంది సభ్యుల జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పలు మార్పులు చేసింది.
గాయం కారణంగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి దూరమవడంతో… సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు ఆసీస్ సెలెక్షన్ కమిటీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బ్యాటర్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. పేసర్లు ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, నాథన్ ఎలిస్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్.. లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘాలు జట్టులోకి వచ్చారు. మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, ఆడమ్ జంపా వంటి అనుభవజ్ఞులైన ప్లేయర్స్ ఆసీస్ జట్టులో ఉన్నారు. ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ గడ్డపై ఆరంభం కానుంది.
ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ఫ్రేజర్ మెక్‌గుర్క్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎలిస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, ఆడమ్ జంపా.