Leading News Portal in Telugu

yuzvendra-chahal-shares-another-cryptic-post-thanks-god-amid-divorce-rumours – NTV Telugu


  • ధనశ్రీ వర్మతో విడాకుల పుకార్ల మధ్య చాహల్ మరో ఫోస్ట్
  • తనకు వచ్చిన క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు- చాహల్
  • ఆ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించని చాహల్
  • గత కొంతకాలంగా చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు.
Yuzvendra Chahal: క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు.. పోస్ట్ వైరల్

భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన భాగస్వామి ధనశ్రీ వర్మతో విడాకుల పుకార్ల మధ్య.. మరో ఫోస్ట్ చేశాడు. గురువారం (ఫిబ్రవరి 20) ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సీక్రెట్ పోస్ట్‌ను పంచుకున్నాడు. ఈ పోస్ట్‌లో చాహల్ తనకు వచ్చిన క్లిష్ట పరిస్థితుల నుండి రక్షించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. ఆ పరిస్థితుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ.. ఈ పోస్ట్ ధనశ్రీ వర్మతో సంబంధం కలిగిన విడాకుల పుకార్లను మరింత బలోపేతం చేసింది. చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో “నేను లెక్కించలేనంత ఎక్కువ సార్లు దేవుడు నన్ను రక్షించాడు. కాబట్టి నేను రక్షించబడిన సమయాలను ఊహించగలను, అవి నాకు తెలియవు. నాకు తెలియకపోయినా, ఎల్లప్పుడూ నా దగ్గర ఉన్నందుకు దేవుడా, ధన్యవాదాలు. ఆమెన్.” అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం.. యుజ్వేంద్ర చాహల్ దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టుతో కలిసి ఉన్నాడు. అయితే, అతను క్రికెట్ ఆడటం లేదు. 2024 డిసెంబర్ 5న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాకు ప్రాతినిధ్యం వహిస్తూ తన చివరి ప్రొఫెషనల్ గేమ్ ఆడాడు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ తమ వివాహ బంధంలో సమస్యలు గురించి వారు చెప్పలేదు. అలాగే.. వారి మధ్య విడాకుల పుకార్లపై కూడా ఎప్పుడు స్పందించ లేదు. చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఇది మొదటిసారి కాదు. జనవరి 2025 ప్రారంభంలో చాహల్ తన కృషి, వ్యక్తిత్వం గురించి రాశాడు. తాను ఎక్కడి నుండి వచ్చి, ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడో అభిమానులకు తెలిపాడు.

చాహల్-ధనశ్రీ విడాకుల పుకార్లు:
సోషల్ మీడియాలో ఈ జంట గురించి విడాకుల పుకార్లు మొదలయ్యాయి. చాహల్, ధనశ్రీ వర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేశారు. చాహల్ తన అకౌంట్ నుండి ధనశ్రీతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు వచ్చాయి. కొంతకాల నుంచి వీరు విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.