Leading News Portal in Telugu

Rohit Sharma’s Catch Drop Denies Axar Patel Historic Hat-Trick in Champions Trophy


  • భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్
  • తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టిన అక్షర్ పటేల్
  • అదే ఓవర్‌లో క్యాచ్ మిస్ చేసిన రోహిత్ శర్మ
  • నిరాశతో చేతులను నేలకేసి కొట్టిన రోహిత్.
Rohit Sharma: అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్.. క్యాచ్ వదిలేసిన రోహిత్ ఏం చేశాడంటే..?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెంట వెంటనే 3 వికెట్లు కుప్పకూలాయి. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ వేసిన ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే.. అదే ఓవర్‌లో మరో వికెట్ పడాల్సింది. మరో వికెట్ పడి ఉంటే.. ఈరోజు చరిత్రలో మిగిలిపోయేది. వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించి, భారత ఆటగాళ్ల ప్రత్యేకమైన జట్టులో చేరేవాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించలేకపోయాడు.

బంగ్లాదేశ్ పై తొలి ఓవర్‌లోనే అక్షర్ పటేల్ రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. మొదటి బంతికే తంజిద్ హసన్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత రెండో బంతికే ముష్ఫికర్ రహీమ్ వికెట్ ను తీశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించే అవకాశం వచ్చింది. అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు ఫీల్డర్లను స్లిప్పులో పెట్టాడు. బ్యాటింగ్‌ చేస్తున్న జాకర్ అలీ కూడా స్లిప్పులో క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌ను రోహిత్ శర్మ వదిలేశాడు. ఆ క్యాచ్ పట్టుంటే అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ అయ్యేది. కానీ.. అవకాశ చేజారిపోయింది. దీంతో.. క్యాచ్ వదిలేసిన రోహిత్ శర్మ నిరాశ వ్యక్తం చేస్తూ.. చేతులతో నేలకేసి కొడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.