Leading News Portal in Telugu

India vs Pakistan 2025 Champions Trophy: Live Streaming & Match Details


  • 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విక్టరీతో మొదలు పెట్టింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. భారత్ తన రెండవ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IND vs PAK: సూపర్ సండేకు రెడీనా.. భారత్-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, పూర్తి వివరాలివే

2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా విక్టరీతో మొదలు పెట్టింది. టోర్నమెంట్‌లోని రెండవ మ్యాచ్‌లో ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. భారత్ తన రెండవ మ్యాచ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడతాయి. చివరిసారిగా ఈ రెండు జట్లు 2024 టీ20 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. తాజాగా.. మరోసారి పోరుకు సిద్ధమయ్యాయి. కాగా.. టీమిండియా, పాకిస్తాన్‌కు సంబంధించిన మ్యా్చ్ వివరాలు, ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడో చూడాలి.. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకుందాం.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. 5వ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఫిబ్రవరి 23, ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. కాగా.. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ ఆసక్తికర పోరును టీవీలో తిలకించేందుకు మీరు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్‌లో చూడవచ్చు. టీవీలో చూడటానికి వీలు కాని వాళ్లు.. మొబైల్‌లో కూడా చూడొచ్చు. ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు.

భారత్ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు
ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, కమ్రాన్ గులాం, ఫహీమ్ అష్రఫ్.